పరలోకమునకు బైబిల్ మార్గం

Video

June 7, 2015

రక్షణ గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. అది నీవు ఎంత మంచివాడవనే దానిమీద ఆధారపడి లేదు. ఎంతో మంది ప్రజలు తాము చాలా మంచివారమని మరియు తాము చాలా మంచివారమగుట వలన పరలోకములో ప్రవేశించనై వున్నారని అనుకుంటూ ఉంటారు కానీ బైబిల్ గ్రంధం ఈ విధంగా సెలవిస్తున్నది, “అందరునూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవుచున్నారు.” (రోమా 3:23). “నీతిమంతుడు లేడు,ఒక్కడును లేడు” అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది (రోమా 3:10). నేను నీతిమంతుడిని కాను. నీవు నీతిమంతుడివి కావు, మన మంచితనమే పరలోకమునకు చేరుస్తుంది అంటే మనలో ఎవరూ పరలోకమునకు వెళ్లలేము ప్రకటన గ్రంధం 21:8 లో బైబిల్ గ్రంథం ఈవిధంగా సెలవిస్తున్నది, “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము.” నేను గతంలో అబద్ధమాడివున్నాను. ప్రతి ఒక్కరూ గతంలో అబద్ధమాడివున్నారు, కావున మనమందరం పాపం చేసివున్నాము, మరియు అబద్ధము కంటే ఘోరమైన పాపములు చేసివున్నాము. మనము దానిని అనుభవిద్దాం. మనమందరం నరకమునకు పాత్రులమై వున్నాము.

“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను."(రోమా 5:8) యేసుక్రీస్తు మనలను ఎంతగానో ప్రేమించుట వలన, ఈ లోకమునకు వచ్చెను. ఆయన శరీరములో కార్యములు చేసిన దేవుడని బైబిల్ గ్రంథం చెపుతున్నది. దేవుడు ప్రాధమికంగా మనుష్య రూపమును స్వీకరించెను. ఆయన పాపం లేని జీవితమును జీవించెను, అయినప్పటికీ వారు ఆయనను కొట్టారు మరియు ఆయన మీద ఉమ్మి వేసి సిలువ వేసివున్నారు. ఆయన సిలువ మీద వున్నప్పుడు "ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను" అని బైబిల్ గ్రంధం సెలవిస్తున్నది. (1 పేతురు 2: 24) కావున నీవు ఎప్పుడైనా చేసిన ప్రతి పాపం మరియు నేను ఎప్పుడైనా చేసిన ప్రతిపాపం యేసు ప్రభువు చేసినట్లు. ఆయన మన పాపముల నిమిత్తం శిక్షను అనుభవించి వున్నాడు. అప్పుడు ఆయన చనిపోయిన తరువాత వారు ఆయన శరీరమును తీసుకెళ్లి సమాధిలో పాతిపెట్టిరి (అపో.కార్య. 2:31). మూడు రోజుల తరువాత ఆయన మరణము నుంచి లేచియున్నాడు. ఆయన తన చేతులలోని రంధ్రములను శిష్యులకు చూపించివున్నాడు. యేసు ప్రతిఒక్కరి కొరకు చనిపోయెనని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెపుతూ వుంది. "మన పాపములకు మాత్రమే కాదు కానీ, యావత్తూ ప్రపంచ పాపముల నిమిత్తం ఆయన చనిపోయెనని"చెపుతున్నది. (1 యోహాను 2:2). కానీ మనం రక్షింపబడుటకు ఖచ్చితంగా చేయవలసిన పని ఒకటి వున్నది. మనం రక్షింపబడుటకు ఏమి చేయాలి? అనే ప్రశ్న బైబిల్ గ్రంథంలోని అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయములో వున్నది. మరియు వారు చెపుతున్నారు, "యేసుక్రీస్తు ప్రభువు నందు నమ్మిక వుంచినట్లయితే వారు మరియు వారి గృహం రక్షింపబడుతుంది." అంతే. ఒక సంఘములో చేరండి, అలా చేసినట్లయితే మీరు రక్షింపబడతారని ఆయన చెప్పలేదు. బాప్తిస్మం తీసుకోండి, మీరు రక్షింపబడుదురు. ఒక మంచి జీవితమును జీవించండి మీరు రక్షింపబడుదు. మీ ప్రతిపాపములను బట్టి పశ్చాత్తాపం పొందండి మీరు రక్షింపబడుదురు, కాదు. ఆయన " నమ్మండి" అని మాత్రమే అన్నారు.

బైబిల్ గ్రంధము మొత్తంలో చాలా ప్రాచుర్యం పొందిన వచనము యొక్క రిఫరెన్సు " ఇన్ ఆండ్ అవుట్ బర్గర్" లోని కప్పు క్రింది భాగములో కూడా వ్రాయబడివుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిఒక్కరూ దానిని వినివుంటారు: యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మరియు నిత్యజీవము అంటే నిత్యజీవము. దాని అర్ధము నిత్యత్వం, మరియు యేసు ఈ విధంగా చెప్పెను, "నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నాచేతిలో నుండి అపహరింపడు." (యోహాను 10:28). ముఖ్యముగా, ముఖ్యముగా, నేను మీతో ఈ విధంగా చెప్పుచున్నాను, నాయందు విశ్వాసముంచు వాడు నిత్యజీవమును పొందునని బైబిల్ గ్రంధములోని యోహాను 6:47 వచనం సెలవిస్తున్నది. నీవు నిత్యము జీవించుదువు. నీవు నీ రక్షణను కోల్పోవు. అది నిత్యమైనది, మరియు నిరంతరం వుండేది. ఒక్కసారి నీవు రక్షణను పొందినట్లయితే, ఒక్కసారి నీవు ఆయనను నమ్మినట్లయితే, నీవు ఎప్పటికిని రక్షింపబడుదువు మరియు ఎటువంటి పరిస్ధితి వచ్చినప్పటికీ నీవు నీ రక్షణను కోల్పోవు.

నేను బయటికి వెళ్లి ఒక అసహ్యమైన పాపము చేసినట్లయితే, దానికి దేవుడు ఈ భూమి మీద శిక్ష విధించును. నేను బయటకు వెళ్లి ఒక వ్యక్తిని హత్య చేసినట్లయితే నేను ఖశ్చితముగా శిక్షింపబడేలా దేవుడు చూస్తాడు, నేను జైలుకు వెళ్లవచ్చు లేదా మరణ శిక్ష కావచ్చు. ఈ లోకం నన్ను శిక్షింపవచ్చు కానీ ఇంకను శిక్షింపబడేలా దేవుడు చూస్తాడు, కానీ నేను నరకమునకు వెళ్లను. నేను నరకమునకు వెళ్లి చేసేది ఎదీ లేదు ఎందుకంటే నేను రక్షింపబడ్డాను, మరియు నేను నరకమునకు వెళ్లినట్లయితే దేవుడు అబద్ధికుడగును. ఎందుకంటే "ఎవరు నా యందు నమ్మిక వుంచుతారో నిత్య జీవమును పొందుతారు మరియు ఎవరైతే నాయందు నమ్మిక వుంచి జీవిస్తారో వారు ఎప్పటికీ చనిపోరు." ఎంతో పాపము చేసినప్పటికీ పరలోకమునకు చేరిన చాలామంది వ్యక్తుల ఉదాహరణ. బైబిల్ గ్రంథములో కలదు. ఎలా? వారు చాలా మంచి వారగుటవలన? కాదు, వారు యేసు క్రీస్తు ప్రభువునందు నమ్మిక వుంచుట వలన. వారి పాపములు క్షమింపబడెను. మిగతా ప్రజలు లోకము దృష్టిలో మంచి జీవితమును జీవించివుండవచ్చు లేదా నిజముగానే మంచి జీవితమును జీవించివుండవచ్చు, కానీ వారు క్రీస్తును నమ్ముకొనకపోయినట్లయితే వారి పాపములకొరకు వారు నరకమునకు పోయి శిక్షను అనుభవింపవలెను.

ఈ ఒక ఆలోచనను పరికించి చూడనివ్వండిః ఈ రోజు మీ ముందుకు తీసుకువద్దామనుకున్న విషయం ఏమిటంటే యేసుక్రీస్తును శిష్యులు అడిగిన ప్రశ్న అది ఏమిటంటే కొద్ది మంది మాత్రమే రక్షింపబడుదురా? అది చాలా మంచి ప్రశ్న. సరే? లేక చాలామంది రక్షింపబడుదురా? లేక చాలా మంది మాత్రమే రక్షింపబడుదురా? చాలామంది పరలోకమునకు వెళతారని ఎవరు ఆలోచిస్తారు - ఈ లోకములోని చాలామంది పరలోకమునకు వెళతారా? సమాధానము ఎమైవుంటుందో ఉహించండిః మత్తయిలో 7 లో ఆయన ఈవిధంగా చెప్పారు, "ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆదారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆదారి సంకుచితమునై యున్నది. దాని కనుగొను వారు కొందరే." (మత్తయి 7:13-14) ఆయన ఇంకా ఈ విధంగా చెప్పారు: "ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీనామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీనామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. "(మత్తయి 7:21-23)

మొట్టమొదటిగా, ప్రపంచములోని ఎక్కువ శాతం మంది యేసును నమ్ముచున్నామని ప్రకటించుకోరు. అదృష్టవశాత్తూ ఈ తరగతి గదిలో చాలామంది యేసును నమ్ముచున్నామని ఒప్పుకొనుచున్నారు, కానీ ప్రపంచములోని ఎక్కువ శాతం మంది యేసును నమ్ముచున్నామని ఒప్పుకోరు. యేసును నమ్ముతున్నామని ఒప్పుకొనిన వారిలో చాలామంది, ఆయనను ప్రభువని పిలిచిన చాలామందిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలామంది ఈవిధంగా అంటున్నారు, "మేము ఇన్ని అద్భుత కార్యములు చేసియున్నాము, మేము ఎందుకు రక్షింపబడలేదు." "నా నుంచి దూరంగా వెళ్లండి, నేను మిమ్మును ఎరుగనని "ఆయన చెప్పును. అది ఎందుకంటే రక్షణ అనేది కార్యములను బట్టికాదు మరియు మీ స్వంత కార్యములు మిమ్ములను రక్షిస్తుందని ఒక వేళ మీరు నమ్మినట్లయితే, మీరు బాప్తిస్మం పొందుకున్నందువలన మీరు పరలోకమునకు వెళతారని మీరు అనుకునట్లయితే, మంచిది, "మీరు ఒక మంచి జీవితమును జీవించారు, రక్షింపబడడానికి ఆజ్ఞలను మీరు అనుసరించారు, మీరు మందిరమునకు వెళ్లాలని నేను అనుకుంటాను, మీయొక్క పాపములనుండి మీరు తొలిగిపోవాలని అనుకున్నట్లయితే ....." మీరు మీయొక్క కార్యముల యందు నమ్మిక ఉంచినట్లయితే, ఒకరోజు యేసు ప్రభువు, "నానుండి దూరంగా వెళ్లండి, నేను మిమ్మును ఎప్పుడూ ఎరుగను" అని అంటారు.

ఆయన చేసిన ప్రతి పనిలో మీరు మీ విశ్వాసమును ఉంచాలి. మీ పాపముల నిమిత్తం సిలువలో మరణించి, పాతిపెట్టబడి తిరిగి లేచిన యేసునందు మీ విశ్వాసమును ఉంచాలి. అది పరలోకమునకు మీ టికెట్ అయి వుంది. మీరు ఇతర విషయములయందు నమ్మిక ఉంచినట్లయితే మరియు "నేను ఒక మంచి క్రైస్తవుడిని మరియు నేను చాలా అద్భుతకార్యముల చేసినందువలన నేను పరలోకమునకు వెళ్లుచున్నాను". ఆయన, "నా నుంచి వెళ్లండి అంటారు." గమనించండి ఆయన ఎమన్నారో, ప్రభువు, "నానుండి దూరంగా వెళ్లండి, నేను మిమ్మును ఎప్పుడూ ఎరుగను." "నేను మిమ్మును ఎరుగుదనని" ఆయన అనలేదు. ఒక్కసారి ఆయన మిమ్మును ఎరిగినట్లయితే ... గుర్తు తెచ్చుకోండి, ఈ విషయమును నేను ముందు చెప్పియున్నానుః అది నిత్యత్వమైనది మరియు నిరంతరమైనది. ఒక్కసారి ఆయన మిమ్మును ఎరిగినట్లయితే, నీవు ఎప్పటికినీ రక్షింపబడినవాడవు. నానుండి దూరంగా వెళ్లండి, నేను మిమ్మును ఎప్పుడూ ఎరుగను అని ఆయన అంటారు, ఎందుకంటే ఆయనను ఎప్పుడూ ఎరగనందువలన మీరు నరకమునకు వెళతారు. ఒక్కసారి ఆయన మిమ్మును తెలుసుకున్నట్లయితే ఆయన తెలుసుకున్నట్లే. ఎలాగు మనపిల్లలు ఎప్పటికీ మన పిల్లలు అయినట్లుగా. కుటుంబంలో సిగ్గుమాలినవారు మీరు అయివుండవచ్చు. మీరు ఈ లోకములో దేవుని చేత బాగా క్రమశిక్షణ చేయబడిన వారయివుండవచ్చు. మీ జీవితము కొరకు ఇక్కడ ప్రయాసపడవచ్చు కానీ రక్షణకొరకు కాదు. ఒక్కసారి మీరు రక్షింపబడినట్లయితే అది పూర్తయిన ఒప్పందం. చివరి దినములలో ఒక ప్రాముఖ్యమైన విషయము గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరియు మనం కొద్ది నిముషములు రక్షణ గురించి అయినా లేదా మరియు చివరి దినములగురించి అయినా ప్రశ్నలకొరకు కేటాయిద్దాం.

1.మీరు పాపి అని ఒప్పుకోండి
2. పాపమునకు శిక్ష అని అర్థఁచేసుకోండి
3. యేసు మీకొరకు చనిపోయి, పాతిపెట్టబడి మరియు తిరిగి లేచెనని నమ్మండి.
4. క్రీస్తు మాత్రమే మీ రక్షకుడని నమ్మండి.
ప్రియమైన యేసూ, నేను పాపినని నాకు తెలుసు. నేను నరకమునకు పాత్రుడనని తెలుసు, కానీ నీవు సిలువ మీద మాకొరకు మరణించి తిరిగి లేచెనని నమ్ముతున్నాను. నన్ను ఇప్పుడే రక్షించండి మరియు నాకు నిత్యజీవమును ఇవ్వండి. నేను నిన్ను మాత్రమే నమ్ముచున్నాను, యేసూ. ఆమెన్.

 

 

 

mouseover