"సీయోను కవాతు" - తెలుగు సినిమా ట్రైలర్ ("Marching to Zion" trailer in Telugu)

Video

April 10, 2015

4 వేల సంవత్సరాల క్రితం, మెసోపొటేమియాలో అబ్రహాముకు దైవం కనిపించి అతనితో ఇలా పలికాడు, “ నీ దేశము నుండియు, నీ బంధువుల నుండియు బయటకి రమ్ము, నేను చూపించిన ప్రదేశానికి పొమ్ము. నేను నీ ద్వారా ఓ గొప్ప దేశమును తయారుచేసెదను.” అబ్రహాము దేవుని ఆజ్ఞను పాటించి, ఆనందభూమి అయిన కనాను వచ్చి, తన కుమారుడు ఐజాక్, మనవడు యాకోబులతో అక్కడ నివసించాడు. యాకోబుకు తరువాత ఇశ్రాయేలుగా పేరును మార్చారు.

కనాను ప్రాంతంలో కరవు కారణంగా, ఇశ్రాయెల్, అతని 12 కుమారులు కిందనున్న ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ వారొక శక్తివంతమైన దేశంగా వృద్ధి చెందారు. ఐగుప్తీయులు శక్తివంతమైన ఇశ్రాయెల్‌ తమ మధ్య ఉన్నందుకు భయపడి, వారిని బానిసలుగా చేసి, బానిసత్వంతో వారి జీవితాలను దుఃఖమయం చేసారు. ఐగుప్తులో 430 ఏళ్ళ బానిసత్వం తరువాత, వారికి మోషే దాస్యవిముక్తి కల్పించగా, ఎర్ర సముద్రం దాటి, అరేబియాలోకి వెళ్ళారు. వారక్కడ సీనాయి పర్వతం వద్ద దైవ చట్టాన్ని అందుకున్నారు.

మోషే‌తో ఐగుప్తుకు వెళ్ళిన తరాన్ని, దేవుని పట్ల వారికి విశ్వాసం లేకపోవడం వల్ల వారిని ఆనందభూమిలోకి రానివ్వలేదు. వాళ్ళను బలవంతంగా 40 ఏళ్ళు అరణ్యవాసం చేయించారు. అయితే దేవునిపై విశ్వాసం గల కొత్త తరం వృద్ధి చెంది, యేహోషువాతో కలిసి ఆనందభూమిలో అడుగుపెట్టారు.

400 సంవత్సరాల పాటు, ఇశ్రాయేలు యొక్క 12 జాతులని, న్యాయాధికారులు, మోషే చట్టం ప్రకారం పాలించారు. ఇతర దేశాలలాగే వారికి రాజొకరు ఉండాలని అనిపించినప్పుడు, దేవుడు సౌల్‌ని వారి రాజుగా నియమించాడు. సౌల్ వారిని 40 ఏళ్ళు పాలించాడు, తరువాత దావీదు రాజు 40 సంవత్సారాలు, ఆ తరువాత, దావీదు కొడుకు సొలోమోను 40 ఏళ్ళు పాలించారు. సోలోమోను హయాములో ఇశ్రాయేలు రాజ్యం పతాక స్థాయికి చేరుకుంది, మొదటి మందిరాన్ని నిర్మించారు, అయితే వృద్ధ దశలో ఉన్న సోలోమోను మనసు దేవుడిపై లేదు కాబట్టి, దేవుడు అతని 10 జాతులు, తన కుమారుడిచే పాలించబడవని చెప్పారు.

సోలోమోను మరణించిన తరువాత, ఇశ్రాయేలు రాజ్యం ముక్కలైంది. ఉత్తరాన ఉన్న పది తెగలు వరుసగా దుష్ట రాజులచే పాలించబడ్డాయి. ఈ రాజులు దావీదు, సోలోమోనుల వారసులు కారు. ఉత్తరాన ఉన్న రాజ్యం తన పేరుని ఇశ్రాయేలుగానే నిలుపుకుంది, చివరికి సమారియా దాని రాజధాని అయ్యింది. చిన్నగా ఉన్న దక్షిణ రాజ్యం, జుడాగా పిలువబడింది, జెరూసలేం దాని రాజధాని అయ్యింది, దావీదు వంశీకులు దానిని పాలించారు. రెండవ రాజు 16తో మొదలై దక్షిణ రాజ్యపు ప్రజలు, వారి రాజు “జుడా” పేరుమీదుగా “జూస్” లేదా యూదులుగా పిలవబడ్డారు.

ఇశ్రాయేలు ఉత్తర రాజ్యపు దుష్టత్వం వల్ల, వారిని గద్దె దింపి, అసీరియన్లు వారిని బందీలుగా తీసుకున్నారు. అక్కడే ఉండిపోయిన ఇశ్రాయేలు వాసులు, ఇతర జాతులకు చెందిన దేశాలతో కలిసిపోయాయి. ఈ దేశాలు చొరబడి, భూమిని ఆక్రమించుకున్నాయి. ఈ ప్రజలనే సమరయులు అని అంటారు, ఉత్తర ఇశ్రాయేలుకు చెందిన 10 తెగలు, మరెప్పటికీ ఒక దేశంగా ఉండబోవు.

ఇతర దేవుళ్ళకు సేవ చేసినందుకు శిక్షగా జుడా దక్షిణ రాజ్యం చివరికి బబులోన్‌లోనికి ఆక్రమించుకోబడుతుంది అలాగే మందిరం కూడా నాశనమవుతుంది. కానీ 70 ఏళ్ళ తరువాత, యూదులు జుడాకి తిరిగి వచ్చి, జెరూసలేంలో ఉన్న మందిరాన్ని మళ్ళీ నిర్మించి, దావీదు వంశీకులైన రాజులచే పాలింపబడుతూ వచ్చారు.

ఏసుక్రీస్తు కాలంలో, జుడా రాజ్యం జుడియా అని పిలవబడి, రోమన్ల పాలనలో ఉంది. ఏసుక్రీస్తు, అతని శిష్యులు జుడియా మొత్తం “దేవుని వాక్యము”ను బోధించి, ఇజ్రాయెల్ అనే తప్పిపోయిన గొర్రెను దారికి తేవడానికి. మూడున్నర సంవత్సరాల మతాచార్యం తరువాత, యూదులు ఏసుక్రీస్తును తమ మహాపురుషుడిగా తిరస్కరించి, అతనికి శిలువ వేయడానికి అక్కడి రోమన్ ప్రభువుని ఒప్పించారు. 3 రోజుల తరువాత, అతను తన సమాధి నుండి లేచివచ్చి, తన శిష్యులకు తాను సజీవుడినని దర్శనమిచ్చి, స్వర్గంలోనున్న తండ్రి కుడి చేతికి అధిరోహించాడు.

ఏసుప్రభువుని శిలువ చేసే కొన్ని క్షణాల ముందు, తనని తిరస్కరించినందుకు గాను, జెరూసలేం తగలబడుతుందని, మందిరం నాశనమవుతుందని, యూదులు అన్ని దేశాలలోకి బందీలుగా వెళతారని జోస్యం ప్రకటించాడు. రోమన్ చక్రవర్తి టైటస్ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జెరూసలేంని ఆక్రమించినప్పడు ఈ జోస్యం నిజమైంది. దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళుగా, యూదులు అన్ని దేశాలలో చెల్లాచెదురుగానే ఉన్నారు.

1948లో అసంభవం అనుకున్నది జరిగింది. ఇశ్రాయెల్ రాజ్యం ఏర్పడింది, యూదులు ఒకప్పుడు తమ ఆధీనంలో ఉన్న ఆనంద భూమిని చేజిక్కించుకున్నారు. ఎంతోమంది క్రైస్తవులు దీనిని అద్భుతంగా, దేవుని ఆశీర్వాదంగా ప్రకటించారు. కానీ అది నిజంగా దేవుని ఆశీర్వాదమా లేదా ఏదైనా చీకటి శక్తుల ప్రమేయం ఉందా? సమాధానం ఈ చిత్రంలో దొరుకుతుంది.

 

 

 

mouseover